Header Banner

విశాఖ ఆర్కే బీచ్‌లో ఇసుక లారీ ఘోర ప్రమాదం! బ్రేక్స్ ఫెయిల్, పలువురికి గాయాలు!

  Tue Feb 18, 2025 11:57        Others

విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఇసుక లారీ భీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో నోవాటల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్డు నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొని చిల్డ్రన్ పార్కులోకి లారీ దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది వాకర్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఈ ప్రాంతంలోనే రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా.. ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో లారీ ముదుభాగం పూర్తిగా దెబ్బతింది. ఈఘటనతో ఆర్కే బీచ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు లారీని తీసేందుకు చాలా శ్రమించారు. లారీ భీభత్సంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్.

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vizag #RKbeach #lorry #accident #todaynews #flashnews #latestupdate